Home  »  TV News  »  Illu illalu pillalu : నర్మదపై వేదవతి ఆగ్రహం.. ప్రేమ డ్యాన్స్ ప్రోగ్రామ్ ట్విస్ట్!

Updated : Jul 1, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -511 లో.... వేదవతితో నర్మద మాట్లాడాలని ట్రై చేస్తుంటే తను కోపంగా అక్కడున్న గిన్నెలు విసిరేస్తుంది. అప్పుడే రామరాజు వస్తాడు‌. ఇక్కడ ఎవరు చెప్పినట్లు వినడం లేదు.. వేరు కాపురం పెట్టాక, మళ్ళీ ఇక్కడికి రావడం ఎందుకని నర్మదని ఉద్దేశించి వేదవతి కోప్పడుతుంటుంది.  మొన్న వల్లికి అలా అయినప్పటి నుంచి మీ అత్తయ్య కొంచెం బాలేదు.. తన మాటలు పట్టించుకోకమ్మ అని  నర్మదతో రామరాజు అంటాడు. అదంతా చూసి వల్లి సుకన్య నవ్వుకుంటారు. వాళ్ళ దగ్గరికి వల్లి వచ్చి.. అత్తయ్య మాటలకి బాధపడకు నర్మద.. నాకు కడుపే పోయింది. దాంతో పోలిస్తే ఈ మాటలు ఎంత అని యాక్టింగ్ చేస్తుంది.

అత్తయ్య మీరు నర్మదని క్షమించండి అని వల్లి అంటుంది. దాంతో వేదవతి అక్కడ నుంచి కోపంగా వెళ్తుంది. నర్మద నేను అత్తయ్యకి చెప్పి నచ్చజెప్పుతానని వల్లి అనగానే.. ఓహ్ నీకు ఇలాంటివి కూడా వచ్చా అన్ని గుర్తుపెట్టుకుంటానని నర్మద అంటుంది.ఆ తర్వాత ప్రేమ దగ్గరికి నర్మద వచ్చి.. అత్తయ్య ఏంటి అసలు మాట వినట్లేదని నర్మద చెప్తుంటే అక్క అవన్నీ పక్కన పెట్టు ముందు నేను చెప్పేది విను.. నేను డ్యాన్స్ ప్రోగ్రామ్ కి వెళ్ళాలి.. నువ్వే హెల్ప్ చెయ్యాలని ప్రేమ రిక్వెస్ట్ చేస్తుంది. వద్దు ప్రేమ ధీరజ్ వద్దని చెప్పాడు.. పైగా ఇంట్లో తెలిస్తే ప్రాబ్లమ్ అవుతుందని నర్మద అనేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అక్క కూడా హెల్ప్ చెయ్యట్లేదని ప్రేమ బాధపడుతుంది. అప్పుడే డ్యాన్స్ ప్రోగ్రాం హెడ్ ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్తాడు. నేను రావడం లేదని ప్రేమ చెప్తుంది. ఎన్నో హోప్స్ పెట్టుకున్నాం.. నువ్వు రాకపోతే ఎలా అని చెప్పి అతను ప్రేమని కన్విన్స్ చేస్తాడు. ఆ తర్వాత వల్లి జరిగింది మొత్తం ఫోన్ చేసి భాగ్యంకి చెప్తుంది. ఇక్కడ  నర్మదపై అత్తయ్య కోప్పడుతున్నారని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ప్రేమ ఎలాగైనా డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్లాలని అనుకొని తన ఫ్రెండ్ ని రప్పిస్తుంది.

తను ఇంటికి వచ్చి మా నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చింది. హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాలి ప్రేమని నాకు తోడు పంపించమని ధీరజ్ ని అడుగుతుంది. అప్పుడే రామరాజు వాళ్ళు వస్తారు. విషయం తెలిసి త్వరగా వెళ్ళండి అమ్మ అని అంటాడు. ప్రేమ బ్యాగ్ తీసుకొని వెళ్తుంటే బ్యాగ్ ఎందుకని నర్మద అడుగుతుంది. అన్ని డౌట్స్ లాయర్ లాగా అని నర్మదపై వేదవతి కోప్పడుతుంది. ఆ తర్వాత ఖర్చులకి రామరాజు డబ్బు ఇస్తాడు. ప్రేమ తన ఫ్రెండ్ వెళ్తారు. ఆ తర్వాత డ్యాన్స్ ప్రోగ్రాం హెడ్ కార్ డ్రైవర్ కి ఫోన్ చేసి ఇంకా అందాల సుందరి రాలేదా త్వరగా తీసుకొనిరా అని చెప్తాడు. అప్పుడే ప్రేమ తన ఫ్రెండ్ వస్తారు. ప్రేమ ఒక్కతే కార్ ఎక్కి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.